అమ్మకు మాటిచ్చా.. బైక్ నడపను... - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మకు మాటిచ్చా.. బైక్ నడపను…

October 27, 2017

ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టి  మైదానంలో దూకుడుగా ఉండే క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమట. కానీ తన అమ్మ షబ్నం సింగ్‌కు ఇచ్చిన మాట కోసం బైకుల మీద తన ఇష్టాన్ని చంపుకున్నాడు.

కోటి రూపాయలు బహుమతిగా ఇచ్చినా కూడా బైకు అస్సలు తోలనంటున్నాడు యూవీ. ఇవాళ రేపు తల్లిదండ్రుల మాటను లెక్క చెయ్యని జెనరేషన్‌లో తల్లికిచ్చిన మాట కోసం తనకు అత్యంత ఇష్టమైన బైకు నడపడం మీద మనసు చంపుకున్నాడు యువీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యూవీ స్వయంగా ఈ విషయాన్ని వెళ్లడించాడు. అప్పట్లో యూవీ బైకులు స్పీడుగా తోలి ఏమైనా దెబ్బలు తగిలించుకున్నట్టున్నాడు. అందేకే వాళ్ళమ్మ గట్టిగా కొడుకు దగ్గరనుండి వాగ్దానం తీసుకున్నట్టున్నది. తల్లికిచ్చిన మాట మీద నిలబడి ఇప్పటి యువతకు ఆదర్శంగా నిలిచాడు. తనకు కారు రైడింగ్ అన్నా ఇష్టమే అంటున్నాడు. కానీ ఎక్కువ వేగంగా వాహనాలు తోలడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. పోయినవారు పోవచ్చునేమో గానీ ఉన్నవారికి జీవితకాల విషాధం అది. పెద్దల మాట చద్ది మూటగా భావించిన యూవీని నేటి యువత ఫాలో అయితే చాలా బాగుంటుంది.