లక్ష మంది బ్రిగేడ్‌గా జిందగీ ఇమేజెస్ ఎఫ్‌బీ గ్రూపు - MicTv.in - Telugu News
mictv telugu

లక్ష మంది బ్రిగేడ్‌గా జిందగీ ఇమేజెస్ ఎఫ్‌బీ గ్రూపు

November 23, 2017

లక్ష మంది బలగంతో జిందగీ ఇమేజెస్ గ్రూపు ఒక పెద్ద మైలురాయిని క్రాస్ చేసింది. ఇంతింతై వటుడింతై అన్నట్టు మెల్లమెల్లగా జిందగీ సైన్యం ముందుకు పరుగు తీస్తున్నది. మనిషి జీవితాల్లో వున్న విభిన్నమైన కోణాలను ఆవిష్కరిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడింది. ఫేస్‌బుక్ వేదికగా ఈ ఉమ్మడి కుటుంబం చాలా మందికి ఒక హృదయ ఛత్రంలా నిలబడింది.

తెలంగాణ ఉద్యమ మూమెంట్లో చాలా అగ్రెసివ్‌గా పాల్గొన్న చేగొండి చంద్రశేఖర్, అదే స్పిరిట్‌తో కామన్‌మేన్ వేదికను ఒక దాన్ని రూపొందించాలనే తలంపులోంచి వచ్చిందే జిందగీ ఇమేజెస్ గ్రూప్. 17 ఆగస్టు 2014 లో ఒకరిద్దరితో ప్రారంభమై నేడు లక్ష మంది సభ్యులుగా రూపాంతరం చెందడం అంత ఈజీ కాదు. ఛాయాచిత్రాల కదంబంలా మునుముందుకు సాగిపోతోంది జిందగీ. ప్రతీ నెల  1000 మంది కొత్త సభ్యులు చేరుతూ ఇవాళ ఈ గ్రూపు లక్షకు చేరింది.ఒక సెక్షన్ లేకుండా యూనివర్సల్ ఐడియాలజీతో, పాజిటివ్‌వేలో ముందుకు పోతున్నది ఈ గ్రూప్.

మన లైఫ్‌ను మన పాయింటాఫ్ వ్యూలో, మన పర్‌ఫెక్షన్‌లో గాకుండా ఇతరుల పాయింటాఫ్ వ్యూలోంచి చూస్తే తెలుస్తుంది జిందగీ యొక్క సింగిడి రంగుల మతలబు. మనం సమాజంలో వుంటూ ఏమైనా చెయ్యగలుగుతాము. ఆ చేసిన పనులను కెమెరాతో క్లిక్కుమనిపించుకొని చూసుకున్నప్పుడల్లా ఆ ఆనందం ఎంత అందంగా వుంటుంది. గతిస్తున్న జ్ఞాపకాలను ఖాయం చేసి భద్ర పరిచే ఏకైక వారధి ఫోటో. అలాంటి ఫోటోలకు వేదికే జిందగీ. మనం రాయలేని, చదవలేని లైఫులు చాలా వుంటాయ్. అలాంటివాటిని ఫోటోగా చూసుకుంటే ఎలా వుంటుంది ? అద్భుతంగా వుంటుంది.. అలాంటి అద్భుతాలకు వేదిక జిందగీ గ్రూపు.సమస్య దగ్గరికి వాళ్ళే వెళ్ళటం, దాన్ని క్లిక్ చేసి ఛాయాచిత్రంగా ప్రెజెంట్ చెయ్యటం అనేది ఒక సెన్సిటివ్ ప్రాసెస్. లైఫ్ మీద మమకారాన్ని పెంచే యాక్షన్ ఇది. రియల్‌లైఫ్‌లో జరిగిందే చెప్పాలి. ప్రాబ్లెమ్స్ వున్నాయని కరెక్టుగా చెప్పగలగాలి. నో ఒపీనియన్స్.. ఎలాంటి నెగెటివ్ కామెంట్లు లేకుండా చాలా ప్యూర్‌గా, మంచి ఉద్దేశంతో ముందుకు పోతోంది జిందగీ. అందుకే అది ఇవాళ ఒక శక్తిగా ఎదిగింది.

చేగొండి చంద్రశేఖర్ ( జిందగీ ఇమేజెస్ గ్రూపు అడ్మిన్ ) :

ఈ స్థాయికి ఎదుగుతుందని అస్సలు అనుకోలేదు. 2006 లో వచ్చింది ఈ ఐడియా. దాన్ని 2010 లో రిజిస్టర్ చేశాను. 2014 లో మొదలు పెట్టాను. ఇంత మంది సభ్యులు చేరుతారని అస్సలు అనుకోలేదు. ఒక్కొక్కరు చేరి జిందగీని బలపరిచారు. ఇది నాకు చాలా ఆనందించదగ్గ విషయం. ఈ గ్రూపులో ఎవరు చేరినా కాంట్రవర్సీ కామెంట్లు చెయ్యకూడదు.. పాజిటివ్‌గా వుండాలి.. తీసే ఫోటోలు ప్రొఫేషనల్ ఫోటోగ్రాఫర్ తీసినట్టుగా వుండవు. వారి వారి దగ్గరున్న ఫోనుల్లో ఫోటోలు తీస్తారు. వాటిలో రానెస్ కనిపిస్తుంది. అది కూడా ఒక సౌందర్యం. నెల నెలా జిందగీ గ్రూపు అందరం రవీంద్ర భారతి వేదికగా కలిసి ఏదైనా ఒక సామాజిక సమస్య మీద చర్చిస్తుంటాం. చేనేతకు మావంతు సపోర్టుగా ఎప్పుడు కలిసినా చేనేత వస్త్రాలు ధరించాలని నిబంధన పెట్టుకున్నాం. తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు కూడా మా జిందగీ ఇమేజెస్ గ్రూపుకు చాలా సపోర్టుగా నిలిచారు. ప్రతీనెలా రవీంద్ర భారతి వేదికను ఇచ్చారు. అలాగే ఈ గ్రూపులో వున్న సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు, అభినందనలు చెప్తున్నాను.