బడి రుణం తీర్చుకున్న జుకర్‌బర్గ్.. 195 కోట్ల విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

బడి రుణం తీర్చుకున్న జుకర్‌బర్గ్.. 195 కోట్ల విరాళం

March 9, 2018

కన్నవాళ్ళ రుణం, గురువుల రుణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేనిది అంటారు. కానీ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ దంపతులు మాత్రం ఆ రెండు రుణాలతో పాటు తాము చదువుకున్న పాఠశాల రుణం కూడా తీర్చుకున్నారు. 3 కోట్ల డాలర్ల (దాదాపు రూ.195 కోట్లు) భారీ విరాళం ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అమెరికాలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో విద్యాభ్యాస సామర్థ్యాన్ని పెంచేందుకు దోహపడేలా హార్వర్డ్‌ యూనివర్సిటీ, మస్సాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటి)కి వారు ఈ నిధులు అందించనున్నారు. జుకర్‌బర్గ్ హార్వర్డ్‌లో చదువుకుంటున్నప్పుడే ఫేస్‌బుక్ పేరిట సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌ను డిజైన్ చేశారు.దీంతో తాను చదువు మధ్యలోనే వదిలేశాడు. తన భార్య ప్రిస్కిల్లా చాన్‌ 2007లో ఐవీ లీగ్‌ స్కూల్‌ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫేస్‌బుక్ మాధ్యమం జుకర్‌బర్గ్ హార్వర్డ్‌లో చదువుతున్నప్పుడే అతని మస్తిష్కంలో రూపు దిద్దుకోవటం విశేషం. 2004లో తన మిత్రుల సహకారంతో ఫేస్‌బుక్ సంస్థను స్థాపించాడు. జుకర్‌బర్గ్‌ను 2010లో ‘ పర్సన్ అఫ్ ది ఇయర్ ’ గా టైమ్ మ్యాగజైన్ ఎన్నుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫేస్‌బుక్ రూపకల్పన తాను అక్కడ చదువుకుంటున్నప్పుడే సాధ్యమైందని జుకర్‌బర్గ్‌కు హర్వర్డ్‌ అంటే ఎనలేని అభిమానం. అందుకే జుకర్‌బర్గ్ ఈ భారీ విరాళంతో తన దాతృత్వాన్ని చాటుకున్నారు.