ఆధార్‌ను ఎప్పుడు, ఎక్కడ వాడామో తెలుసుకోవచ్చు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్‌ను ఎప్పుడు, ఎక్కడ వాడామో తెలుసుకోవచ్చు..

December 8, 2017

ప్రస్తుతం ఏ అవసరానికైనా ఆధార్ కార్డు కావాల్సిందే. పాన్ కార్డు, మెుబైల్ ఫోన్, బ్యాంక్ లోన్లు.. ఇలా ప్రతిదానికి ఆధార్ కార్డునే అనుసంధానం చేయాలి. ఐడెంటిటీకి ఆధార్ మించిది మరొకటి లేదు. దీతో తమ తప్పనిసరిగా  ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నాం.  ఇందులో మన ఐరిస్ ,ఫింగర్ ప్రింట్స్ , చిరునామా ఇతర వివరాలు  ఉంటాయి. ఆధార్‌ను అనుసంధానం చేయడం వలన దుర్వినియోగం జరుగుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆధార్‌ను వివరాలు హ్యాకర్ల చేతిలో పడితే ఎలా అన్న భయం నెలకొంది. అయితే ఈ సమస్యలకు పరిష్కారం లభించింది. మనం మన ఆధార్ కార్డును ఎప్పడు ఎక్కడ ఎలా వాడామో తెలుసుకునే అవకాశం ఉంది. ఆధార్ కార్డు జారీ చేసే యూఏడీఏఐ వెబ్ సైట్ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.  మీరు కూడా మీ ఆధార్ గురించి తెలుసుకోండి .

– యూఐడీఏఐ ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ పేజ్‌కు వెళ్లాలి (https://resident.uidai.gov.in/notification-aadhaar)

– మీ ఆధార్ నంబర్‌తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి

– జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే.. రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.

– తర్వాతి పేజీలో మీకు ఎలాంటి సమాచారం కావాలో కోరుతూ కొన్ని ఆప్షన్స్ డిస్‌ప్లే అవుతాయి. బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్‌లాంటివి. ప్రస్తుత తేదీ నుంచి గరిష్ఠంగా ఆరు నెలల కిందటి వరకు మీరు ఆధార్‌ను ఎలా ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు.

– చివరి కాలమ్‌లో ఓటీపీ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే మొత్తం వివరాలు వస్తాయి.

– మీరు ఏ రోజు, ఏ సమయానికి, ఎలాంటి పని కోసం ఆధార్‌ను ఇచ్చారన్న వివరాలు వస్తాయి. అయితే ఇందులో మీ ఆధార్ వాడిన కంపెనీ లేదా ఏజెన్సీ పేర్లు మాత్రం చూపించదు.