11 ఏళ్లకే డిగ్రీ రాసేస్తున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

11 ఏళ్లకే డిగ్రీ రాసేస్తున్నాడు..

December 15, 2017

పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతను ఈ  చిన్నోడు నిజం చేస్తున్నాడు.. 11 ఏళ్లకే డిగ్రీ మెుదటి ఏడాది  పరీక్షలు రాసి శభాష్ అనిపించుకుంటున్నాడు అగస్త్యా జైస్వాల్. ఈ బాలుడు యూసఫ్‌గూడ సెయింట్ మేరీస్ డిగ్రీ కళాశాలలో బీఏ( మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ) మెుదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం మెుదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి.తార్నాకలోని అలియన్స్ డిగ్రీ కాలేజీలోని పరీక్షా కేంద్రంలో పరీక్ష గురువారం మెుదటి పరీక్ష రాశాడు. జైస్వాల్ 8 సంవత్సరాలు ఉన్నప్పడే 2015లో 10వ తరగతి పరీక్షలు రాశాడు. ఈ ఏడాది మార్చిలో ఇంటర్ ఉత్తీర్ణుడైయ్యాడు. జైస్వాల్ అక్క నైనా జైస్వాల్ అంతర్జాతీయ టేబుల్  టెన్నిస్ క్రీడాకారిణి, ఆమె కూడా అతి చిన్న  వయస్సులోనే 10వ తరగతి, ఇంటర్ , డిగ్రీ, పీజీ పూర్తి చేసి రికార్డు సృష్టించింది.