రూ. 9కే అపరిమిత కాల్స్.. ఎయిర్‌టెల్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 9కే అపరిమిత కాల్స్.. ఎయిర్‌టెల్ ఆఫర్

February 16, 2018

రిలయన్స్ జియో నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది. ‘ఎంట్రీ-లెవల్’ 9 రూపాయలకే రీచార్జ్‌‌ అంటూ వినియోగదారులకు చవక ఆఫర్‌ను పట్టుకొచ్చింది.

ఈ ఆఫర్ కింద అపరిమిత వాయిస్ కాల్స్‌, 100 ఎంబీ, ఎస్‌ఎంఎస్‌లు వినియోగదారులకు అందుతాయి. అయితే పిండికొద్దీ అన్నట్లు దీని వాలిడిటీ కేవలం ఒక్క రోజు మాత్రమే. అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌తోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లను, 100 ఎంబీ డేటాను 4జీ వేగంతో  వినియోగదారులు వాడుకోవచ్చు. రిలయన్స్‌ జియో రూ.19 ప్లాన్‌కు కౌంటర్‌గా ఎయిర్‌టెల్‌ ఈ రూ.9 రీచార్జ్‌ ప్యాక్‌ను తీసుకొచ్చింది.