ట్రంప్‌పై పోర్న్‌స్టార్ దావా - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్‌పై పోర్న్‌స్టార్ దావా

March 7, 2018

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌‌పై పో‌ర్న్‌స్టార్‌ స్టోర్మి డేనియల్స్  దావా వేసింది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు తమ మధ్య ఉన్న సంబంధాలను బహిర్గతం చేయకుండా ఉండేందుకు  చేసుకున్న (నాన్‌డిస్‌క్లోజర్‌) ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆమె బుధవారం లాస్‌ఏంజెల్స్‌లో న్యాయమూర్తిని కోరింది. ఈ ఒప్పందంపై ట్రంప్‌ స్వయంగా సంతకం చేయనందున ఇది చెల్లుబాటు కాదని ఆమె వాదించింది.  తాను ట్రంప్‌తో ఏడాది పాటు సన్నిహితంగా ఉన్నా తమ మధ్య శారీరక సంబంధం లేదని తెలిపింది.ఒప్పందం ప్రకారం  ట్రంప్‌ ఆమెకు 1,30,000 డాలర్లు చెల్లించారు.  ఆమెతో ఆయనకు ఎప్పుడూ ఎఫైర్‌ లేదని ట్రంప్‌ న్యాయవాది మైఖేల్‌ కొహెన్‌ చెప్పారు. మరోవైపు   ట్రంప్‌తో సంబంధాలపై తను మాట్లాడకుండా ఉండేందుకు ఆయన న్యాయవాది కోహెన్‌ ఒత్తిడి చేస్తున్నారని  పోర్న్‌స్టార్‌ న్యాయమూర్తికి నివేదించారు. పలువురు మహిళలతో ట్రంప్‌ కొనసాగించిన లైంగిక సంబంధాలు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.