దీపికకు ఏపీ అవార్డుపై రగడ - MicTv.in - Telugu News
mictv telugu

దీపికకు ఏపీ అవార్డుపై రగడ

November 20, 2017

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ  వివాదంలో చిక్కుకున్నారు. ఆదివారం జరిగిన ‘సోషల్ మీడియా సమ్మిట్2017 అవార్డు’ కార్యక్రమంలో ఆమె బాలీవుడ్ నటి దీపిక పదుకునె‌కి అవార్డు ఇచ్చారు. దీనిపై వివాదం మొదలైంది. అవార్డులను టాలీవుడ్ నటులకు ఇవ్వాలిగాని, బాలీవుడ్ నటులకు ఇవ్వడమేంటని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. వివాదంలో ఉన్న పద్మావతి మూవీ నటికి అవార్డు ఇవ్వడం సరికాదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.‘టాలీవుడ్ లో దీపిక స్థాయికి తగినవాళ్లెవరూ లేరా..?’ అని ప్రశ్నిస్తున్నారు. నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతం చూపారని విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ సర్కారుకు అఖిల ప్రియ మరో కొత్త తలనొప్పి తెచ్చారని టీడీపీ వర్గాలు గొణక్కుంటున్నాయి.ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సోషల్ మీడియా సమ్మిట్-2017జరిగింది. దీపికా పదుకునెతోపాటు  టాలీవుడ్ నటుడు రానా, సంగీత దర్శకుడు అనిరుధ్, షార్ట్ ఫిల్మ్ హాస్యనటుడు వైవా హర్షలకు అవార్డులను అందజేశారు.