అవెంజర్స్‌ విలన్‌కు భళ్లాలదేవ గొంతు - MicTv.in - Telugu News
mictv telugu

అవెంజర్స్‌ విలన్‌కు భళ్లాలదేవ గొంతు

March 26, 2018

హాలీవుడ్ సినిమాలో తెలుగు హీరో రానా దగ్గుబాటి గొంతుకను వినిపించనున్నాడు. ‘అవెంజర్స్ సిరీస్’ చిత్రాలకు సీక్వెల్‌గా వస్తున్న ‘అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’  సినిమాలో హీరోలను ఢీ కొట్టే సింగల్‌మేన్ ఆర్మీ.. విలన్ తానోస్ పాత్రకు రానా డబ్బింగ్ చెప్పాడు.

ఈ విషయంపై రానా మాట్లాడుతూ… ‘నేను చిన్నప్పటి నుంచి మార్వెల్ కామిక్స్ చదువుతూ, చూస్తూ పెరిగాను. మార్వెల్‌ సంస్థ ఎవ్వరూ ఊహించని విధంగా మంచి కథలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఐరన్‌ మాన్‌, కెప్టెన్‌ అమెరికా నచ్చిన పాత్రలు. ఈ సినిమాలో విలన్‌ తానో పాత్రకు డబ్బింగ్‌ చెప్పటం చాలా ఆనందంగా ఉంది.. ’ రానా అన్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగులో రానా డబ్బింగ్‌ చెప్పినట్లు గానే ఇతర భాషల్లో కూడా అక్కడి నటీనటులతో డబ్బింగ్‌ చెప్పిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘రాజరథం’ సినిమాలోనూ రానా ఓ వాహనానికి డబ్బింగ్ చెప్పడం తెలిసిందే.