ఆడవారి రక్షణ కోసం 58 పెళ్లిళ్లు చేసుకున్నా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆడవారి రక్షణ కోసం 58 పెళ్లిళ్లు చేసుకున్నా..

December 13, 2017

జార్ఖండ్‌కు చెందిన 83 ఏళ్ల బాగున్ బాయ్ పేరుతో తిరుగు లేని రికార్డు ఉంది. 1967 నుంచి ఐదు సార్లు ఎంపీగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. అసలు రికార్డు ఇది కాదు.. మరోటి. ఆయనకు గారికి దాదాపు 58 పెళ్లిళ్లు జరిగాయని  గ్రామ ప్రజలు చెప్పుతుంటారు. ఇన్ని పెళ్లిళ్లు  ఎందుకు చేసుకున్నారు అనే ప్రశ్నకు ఆయన ఇటీవల  సమాధానం చెప్పారు.‘గతంలో ఈ ప్రాంతంలో ఆదివాసీల జాతరలు ఎక్కువగా జరిగేవి. ఈ జాతరకు వచ్చే వ్యాపారులు ఆదివాసీ స్త్రీలను లైంగికంగా వాడుకునేవారు. ఆ  సమయంలో కొందరు గర్బం కూడా ధరించేవారు. కొందరు తీవ్ర అనారోగ్యానికి గురై మరణించేవారు.  అలాంటి వారికి రక్షణ కల్పించి, చేయూతను అందించాను. దాంతో చాలా మంది నన్ను భర్తగా చెప్పుకునేవారు. నా దగ్గరే ఉండేవారు. చిన్నిచితకా పనులు చేసుకునేవారు. తిండికి లోటు ఉండేది కాదు..  వారికి తర్వాత ఎవరైనా  నచ్చితే వారితో వెళ్లిపోయేవారు. ఈ విధంగా నా జీవితంలోకి చాలా మంది ఆడవారు వచ్చి, వెళ్లి పోయారు. వారిలో ఎంతమంది పేర్లను నేను గుర్తు పెట్టుకోగలను?’ అని అన్నారు.

బాగున్ కేవలం ఒంటిపై ధోవతీ మాత్రమే ధరిస్తారు. గాంధీ, వినోభా భావేల స్పూర్తితో ధోతి ధరిస్తున్నాని  తెలిపారు.