జై సింహ  ఫస్ట్‌లుక్ - MicTv.in - Telugu News
mictv telugu

జై సింహ  ఫస్ట్‌లుక్

November 1, 2017

నందమూరి బాలకృష్ణ 102వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘జై సింహ’. ఈ చిత్రం కేఎస్  రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకుంది. దీంతో  ఈ రోజు సినిమా ఫస్ట్‌లుక్ ఫోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఓవైపు ఎన్టీఆర్ విగ్రహం ఉండడంతో సినిమాలోె ఆయన ప్రస్తావన ఉంటుందని భావిస్తున్నారు.  ఈ మూవీలో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని సీకే ఎంటర్ టైన్మంట్ బ్యానర్‌పై సీ కళ్యాణ్  నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 12న విడుదల కానుంది.