‘మహిళా దినోత్సవం’ సందర్భంగా బిల్‌గేట్స్ భారీ విరాళం ! - MicTv.in - Telugu News
mictv telugu

‘మహిళా దినోత్సవం’ సందర్భంగా బిల్‌గేట్స్ భారీ విరాళం !

March 7, 2018

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిల్‌గేట్స్‌ భారీ విరాళం ప్రకటించారు. మహిళ ఆర్థిక సాధికారిత సాధించడమే లక్ష్యంగా నాలుగు దేశాలకు 170 మిలియన్‌ డాలర్ల(1000 కోట్లు) ప్రాజెక్ట్‌ను బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది.

బిల్ గేట్స్  ప్రకటించిన నాలుగు దేశాల్లో భారత్‌ ,కెన్యా తంజానియా ,ఉగండా కూడా ఉన్నాయి. లింగ  విభేదం లేకుడా ఉండేందుకు,డిజిటల్,ఆర్థిక రంగం ,ఉద్యోగ అవకాశాలు పెరగడం,వ్యవసాయ రంగం వంటి అంశాలల్లో మహిళలను ప్రోత్సాహించేందుకు మంగళవారం బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ఈ ప్రకటన చేసింది.ఒక మహిళ తన జీవితాన్ని తనకు తానుగా భవిష్యత్త్‌ను మంచిగా రూపొందించుకోవాలని బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ కో-చైర్‌ మెలిండా గేట్స్‌ అన్నారు. మహిళల చేతుల్లో డబ్బులు ఉంటే, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనే అంశంపై అవగాహం కలిగి ఉంటారని, దాంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. పురుషుల కంటే మహిళలు తక్కువగా భావించే భావన  అనాదిగా వస్తుందని,మహిళలు ఆ నిబంధనలను మారుస్తారని చెప్పారు. నగదు లేదా మొబైల్‌ మనీ వంటి ఆర్థిక వనరుల విషయంలో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తే, ఆ నిర్ణయాలు ఆమెపై, తన కుటుంబ సభ్యులపై మంచి ప్రభావాన్ని చూపుతాయని, దీని ద్వారా మహిళలు సాధికారిత సాధిస్తారని ఫౌండేషన్‌ చెప్పింది.