మణికర్ణికకూ కష్టాలు.. బ్రాహ్మణుల ఆరోపణలు ఇవీ.. - MicTv.in - Telugu News
mictv telugu

మణికర్ణికకూ కష్టాలు.. బ్రాహ్మణుల ఆరోపణలు ఇవీ..

February 6, 2018

పద్మావత్ సినిమాపై వివాదాలు సద్దుమణుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌లో మరో సినిమా వివాదంలో చిక్కుకుంది.  ఎప్పుడూ వివాదంలో నిలిచే బాలీవుడ్ నటీ కంగనౌ రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న  చారిత్రకం చిత్రం ‘మణికర్ణిక’. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా  తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరెక్కిస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు క్రిష్  దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘బాహుబలి’ చిత్ర రచయిన విజేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నాడు.

ఈ చిత్రంలో  లక్ష్మీబాయి  చరిత్రను వక్రీకరించారంటూ సర్వ బ్రహ్మణ మహాసభ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు సభ అధ్యక్షుడు సురేశ్ మిశ్రా రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాశాడు.ఈ చిత్రంలో రాణి లక్ష్మీబాయికి ఓ బ్రిటీష్ వ్యక్తికి  మధ్య ప్రేమ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు.

జై శ్రీ మిశ్రా రాసిన వివాదాస్పద పుస్తకం ‘రాణీ’ ఆధారంగా మణికర్ణికను తెరకెక్కిస్తున్నారని తమకు అనుమానం కలుగుతోందని చెప్పారు. ఝాన్సీ  మహారాణి చరిత్రకు మచ్చతెచ్చే విధంగా సినిమా తీస్తే  చూస్తు  ఊరుకునే ప్రసక్తే లేదంటూ చిత్ర యూనిట్‌కు హెచ్చరికలు చేశారు.