కంగనా పాట..సమంత మాట..! - MicTv.in - Telugu News
mictv telugu

కంగనా పాట..సమంత మాట..!

September 14, 2017

బాలీవుడ్ వివాదాల హీరోయిన్ కంగనా రనౌత్ పై సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసలు వర్షం కురిపించింది. ఆ మధ్య హృతిక్ , ఆదిత్య పంచోలి పై కామెంట్స్ చేయడంతో వార్తలలో నిలిచిన కంగనా, తాజాగా బాలీవుడ్ హీరోలను టార్గెట్ చేసి ఓ సాంగ్ ను రూపొందించింది.

ఈ పాట ‘చిట్టియా కలైయా వే ‘పాటను రీరైట్ చేసి ‘కాజ్ ఐ హ్యావ్ వెజైనా రే’… అంటూ మార్చిన పాటలో డైరెక్టర్ హీరోకి హారతి పళ్ళెం పట్టి స్వాగతం చెప్పడం, హీరోకి భజన చేయడం వంటివి ప్రస్తుత రోజులలో జరుగుతున్నాయని సాంగ్ తో చెప్పేసింది కంగనా. ఫీమేల్ లీడ్ అంటే హీరోయిన్ ని డైరెక్టర్ గుర్తు  పట్టకపోవడం … లవ్ ఇంటస్ట్ర్ అంటేనే గుర్తుకు రావడం ఫెమినా జీ అంటూ పాటలో హీరోను పలికించడం.. హీరో పేర్ల తర్వాత మా పేర్లు.. కానీ మా కంటే వాళ్ల చెక్కులలో ఎక్కువ సున్నాలు అంటూ కౌంటర్లు వేయడం , ఇలా ఒక పాటలో  అన్ని చేసేసింది కంగనా రనౌత్. ఈ పాటను చూస్తే మహిళను కేవలం గ్లామర్ కోసం వాడుతున్నారని చెప్పకనే  చేప్పేసింది. మహిళ సాధికరతను  ప్రకటించేందుకు ఈ సాంగ్ చేసిందా అని అనుంటున్నారు అందరు .

ఇది నచ్చి సమంత “లెజెండరీ ..ధైర్యానికంటూ ఓ ముఖం ఉంటే అది నువ్వే మై క్వీన్ “అని ట్వీట్ చేసింది.

మెున్నటికి మెున్న జ్యోతిక కూడా పురుషాధిక్యతపై మండిపడింది. హీరోల సినిమాలు ఎంత చెత్తగా ఉన్న నాలుగైదు రోజులు ఆడుతాయి. అదే లేడి ఓరియెంటెడ్ మూవీ ఎంత మంచి కథతో వచ్చినప్పటికి వారం తరువాత వసూళ్ళు రావడం మెుదలవుతుంది. సినీ పరిశ్రమలో మహిళకు ప్రాధాన్యత చాలా తక్కువ అని ఈ పరిస్థితి మారాలి అని గట్టిగా చెప్పింది. ఏదేమైన బాలీవుడ్ ప్రముఖుల తీరును విమర్శిస్తూ కంగనా తీసిన ఈ సాంగ్ ప్రస్తుతం  బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.