అప్పుడు ఒక సబ్బు కొట్టేసింది.. ఇప్పుడు 100 ఇచ్చేసింది..! - MicTv.in - Telugu News
mictv telugu

అప్పుడు ఒక సబ్బు కొట్టేసింది.. ఇప్పుడు 100 ఇచ్చేసింది..!

February 19, 2018

ఒక మహిళ తాను చేసిన దొంగతనానికి 18 ఏళ్ల తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఆ పశ్చాత్తాపాన్ని వినూత్నంగా చూపింది. చైనాలోని హేనాన్‌లో ఓ మహిళ 12 ఏళ్ల వయసున్నప్పుడు తన తల్లికి ఇష్టమైన సబ్బును షాపు నుంచి చోరీ చేసింది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు పశ్చాత్తాపపడుతూ వచ్చింది. 18 ఏళ్ల తరువాత అందుకు ప్రాయశ్చిత్తంగా ఏకంగా 100 సబ్సులను తీసుకుని తిరిగి ఆ  దుకాణానికి అప్పగించింది. ఈ వార్త చైనాలో సంచలనంగా మారింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మా అమ్మకు ఈ సబ్బంటే ఎంతో ఇష్టం. అయితే కొనేందుకు డబ్బులు లేవు. ఆ సమయంలో నేను  దుకాణం నుంచి సబ్బును దొంగిలిచ్చాను.  అప్పటి నుంచి నాలో తప్పు చేశాననే భావన నెలకొంది. అందుకే దానినికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను’ అని తెలిపింది. ఆమె పశ్చాత్తాపాన్ని అర్థం చేసుకున్న దుకాణదారుడు ఆ సబ్బులను తన సిబ్బందికి పంచిపెట్టాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.