సిగరెట్లు కొనింది.. డబ్బులడిగితే కొట్టింది.. - MicTv.in - Telugu News
mictv telugu

సిగరెట్లు కొనింది.. డబ్బులడిగితే కొట్టింది..

November 20, 2017

ఆమె.. ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లను  అప్పుగా తీసుకునేది..  ఎప్పుడో  ఒకసారి డబ్బు చెల్లిస్తుండేది. దాంతో విసుగెత్తిన దుకాణదారుడు తన బాకీ చెల్లించమని అడిగాడు. అంతే  ఆమెకు కోసం వచ్చింది. నన్నే డబ్బు అడుగుతావా అంటూ కత్తితో దాడి చేయడమే కాక అతనిపై వేడి టీ కూడా పోసింది.థానేలోని  విష్ణు కాలనీలో 38 ఏళ్ల మహిళ దగ్గర్లోనే ఓ 75 ఏళ్ల వృద్ధుడు నడిపే  సిగరెట్ల దుకాణానికి వచ్చి తరుచూ సిగరెట్లు కొనుగోలు చేసేది. ఎప్పుడో ఓ సారి డబ్బులు చెల్లించేది. అలాగే ఈ నెల 18న కూడా ఆమె దుకాణానికి వచ్చి సిగరెట్ ప్యాకెట్లు తీసుకుంది. సిగరెట్లకు డబ్బులు ఇవ్వాలని యాజమాని గట్టిగా  అడిగాడు. అంతే ఆమెకు కోపం వచ్చింది. యాజమానిని దూషిస్తూ షాపులోని కత్తితో దాడి చేసింది. అంతటితో ఆగకుండా బయటకు ఈడ్చుకొచ్చి కొట్టింది.  అంతటితోనూ ఊరుకోకుండా..  పక్కనే ఉన్న దుకాణంలో కాగుతున్న వేడివేడి టీ‌ని తీసుకొచ్చి అతని మీద పోసి పారిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు దుకాణదారుడిని ఆసుపత్రికి తరలించారు.బాధితుడి ఫిర్యాదు మేరకు ఆ మహిళను అరెస్టు చేశారు. మరణాయుధాలతో దాడి చేసి, వ్యక్తికి ప్రాణాభయం కలిగించడం, మోసం చేయడం కింద ఆమెపై కేసులు పెట్టారు.