రాముడి సంగతి తర్వాత .. ముందు నూనె ఇవ్వండి - MicTv.in - Telugu News
mictv telugu

రాముడి సంగతి తర్వాత .. ముందు నూనె ఇవ్వండి

October 21, 2017

దీపావళి సందర్బంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని సరయూ నదీ తీరంలో  1. 8 లక్షల దీపాలను వెలిగించి, గిన్నిస్ బుక్‌లో రికార్డు సృష్టించడం తెలిసిందే. అందుకోసం 14 వేల లీటర్ల నూనెను వాడారు. అయితే పండగ అయిపోయాక.. ఆ దీపాల్లో నూనె అలాగే మిగిలిపోయింది. వంటనూనె కొనుక్కే తాహతులేని స్థానిక బీదాబిక్కీ ప్రజలు ఆ దీపాల్లోని నూనెను సేకరిస్తున్నారు.

డబ్బాలు తీసుకొచ్చి.. ఒక్కో ప్రమిదను వెతికి వెతికి నూనె వొంపుకుంటున్నారు. ‘పండగ పుణ్యమా అని కాస్త ఇలా నూనెకు నోచుకుంటున్నాం.. కానీ మాకీ వాడి పారేసిన నూనెను ఎత్తుకోవాల్సిన గతి పట్టకుండా ప్రభుత్వం నెలకు రెండు కేజీల వంట నూనె ఇస్తే బావుంటుంది కదా’ అని వినీత అనే మహిళ కోరింది. అయోధ్యలో కోట్లు ఖర్చు పెట్టి 100 మీటర్ల ఎత్తయిన రాముడి విగ్రహాన్ని పెట్టే ముందు.. తమకు  కాసింత తిండి, మంచినీరివ్వాలని స్థానికులు కోరుతున్నారు.