డేరా స్వచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహిమ్ గుర్మీత్ సింగ్ అత్యాచార కేసులో దోషిగా నిర్థారించి తీర్పు ఇచ్చిన సీబిఐ జడ్జి జగదీప్ సింగ్ కు ప్రాణహని ఉంది. పంచకులలోని ఆయన ఇంటి ముందు భారీగా పోలిసులను మోహరించారు.
2002 లో ఇద్దరు స్వాద్విలపై ఆత్యాచారం చేశారన్న ఆరోపణలపై పంచకుల సిబీఐ కోర్టు దోషిగా తేల్చి శుక్రవారం తీర్పివ్వడం తెలిసిందే. బాబా అనుచరుల నుంచి ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. వెంటనే ఆయనకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.