ట్రంప్ ట్వీట్లతో చెప్పులు..! - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్ ట్వీట్లతో చెప్పులు..!

September 15, 2017

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు ఏది చేసినా..ఏం మాట్లాడిన సంచలనమే. ఇంకా ఆయన ట్వీట్లు కూడా దుమారం రేపుతుంటాయి. ట్రంపు ఒక విషయాన్ని సమర్థిస్తూ ట్వీట్ చేస్తే.. మరోసారి అదే అంశాన్ని వ్యతిరేకిస్తూ…  మరో ట్వీట్ చేస్తుంటారు.” కొంత మంది విశ్వసనీయమైన వ్యక్తులు నా దగ్గరకు వచ్చి అధ్యక్షుడు బరాక్ ఒబామా బర్త్ సర్టిఫికెట్ నకిలీదని “చెప్పారు అంటూ అధ్యక్షుడు కాక ముందు ఆగస్టు 6, 2012 లో ట్వీట్ చేశాడు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక “ఆధారాలు లేనిదే నిజాయితీ లేని మీడియా చెప్పిన వార్తలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దు “అని సెప్టంబర్ 30,2016లో మరో ట్వీట్  చేశారు. ఇలా ఒకే అంశంపై రెండు విభిన్న వాదనలు వినిపించడం ఆయనకు ఇలా ట్వీట్స్ చేయడం ఏం తొలిసారి కాదు.

ట్రంపు వివిధ సందర్బల్లో ఒకే అంశంపై చేసిన రెండు విరుద్దమైన ట్వీట్లను అమెరికాకు చెందిన’ ప్రెసిడెన్షియల్ ఫ్లీప్ ఫ్లాప్స్ ‘అనే సంస్థ  చెప్పులపై ట్రంపు ట్వీట్లను ముద్రిస్తూ తయారు చేసింది.ఈ సంస్థ ఇలాంటి చెప్పులను తయారు చేయడం ఇదే తొలిసారి కాదు.2014 లో అమెరికా  ప్రధాన కార్యదర్శి ‘జాన్ కెర్రీ’ విధానాలను కూడా చెప్పులపై ముద్రిస్తూ తయారు చేసింది. ఇదీ కేవలం ప్రజల్లో అవగాహన కల్ఫించడానికి, కొత్తదనం కోసం చేసిన ప్రయత్నం మాత్రమే అని సంస్థ నిర్వాహకులు తెలిపారు.