చర్మం పొడిబారుతోందా..! ఇలా చెక్ పెట్టండి! - MicTv.in - Telugu News
mictv telugu

చర్మం పొడిబారుతోందా..! ఇలా చెక్ పెట్టండి!

March 15, 2018

శర్మం ఎక్కువగా శీతాకాలంలో పొడిబారుతుంది. కానీ ఈ మధ్య వాతావరణంలో‌ని  కాలుష్యం వల్ల వేసవిలోనూ ఈ సమస్య తలెత్తుతోంది. వేడివేడి నీటితో స్నానం, గాఢత ఎక్కువగా ఉండే సబ్బులను వాడటం వల్ల శరీరంలో తేమ తగ్గుతుంది. దీంతో దురద, చర్మం పగలం వంటి సమస్యలు వస్తాయి. వీటిని అరికట్టి, చర్మాన్నికోమలంగా మార్చుకోవాలంటే కింది జాగ్రత్తలు తీసుకోవాలి.

చర్మం ఎక్కువగా పొడిబారితే హ్యుమిడిఫైయర్లను వాడాలి. ఇవి చర్మానికి తేమ అందిస్తాయి.

 

గంటలకొద్దీ స్నానం చేయకుండా పది నిమిషాల్లో, అదీ వేడివేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో చేయాలి. లేకపోతే చర్మంలోని సహజసిద్ధ తైలాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ నూనెలు తొలగిపోతే చర్మం పొడిగా మారుతుంది.

 

సబ్బు వాడకాన్ని వీలైనంత వరకూ తగ్గించుకోవడం మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే తేమ శాతం ఎక్కువ ఉండే వాటిని, ఆల్కహాల్‌, గాఢత లేని సబ్బులను వాడాలి.

 

స్నానం చేసి వచ్చిన వెంటనే శరీరం పూర్తిగా తడారక ముందే కాళ్లూచేతులకు మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. అలా అయితే తేమ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.