జీన్స్ వేసుకునే అమ్మాయిలపై లైంగిక దాడి తప్పుకాదు - MicTv.in - Telugu News
mictv telugu

జీన్స్ వేసుకునే అమ్మాయిలపై లైంగిక దాడి తప్పుకాదు

November 2, 2017

జీన్స్ వేసుకునే ప్రతి అమ్మాయిని లైంగికంగా వేధించవచ్చు’ ఈ వ్యాఖ్యలు చేసింది  ఈజిప్ట్ లోని ఓ న్యాయవాది. అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈజిప్ట్ దేశంలో వ్యభిచారంపై కొత్త చట్టం తెచ్చారు. అయితే దీనిపై చర్చించేందుకు ఓ టీవీ ఛానల్‌కు వచ్చిన నబి అల్‌వాల్ష్ అనే న్యాయవాది,ఓ మహిళతో వాగ్వాదానికి దిగాడు.

అంతటితో ఊరుకోకుండా ‘ జీన్స్ వేసుకునే ప్రతి అమ్మాయిని లైంగికంగా వేధించవచ్చు, తప్పేం కాదు,అలాంటి వారిని రేప్ చేయడం తప్పుకాదని, అది మన జాతీయ బాధ్యత’ అంటూ  దుమారం రేపే మాటలు మాట్లాడాడు. న్యాయవాది చేసిన వ్యాఖ్యలపై మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. మహిళల గురించి తప్పుగా మాట్లాడినందుకు, న్యాయవాదిపై మరియు షోను ప్రసారం చేసినందుకు టీవీ ఛానల్‌పై  కఠిన చర్యలు తీసుకోవాలని  ఈజిప్ట్ మహిళ కమీషన్ డిమాండ్ చేస్తోంది.