అధిక బరువును ఈజీగా తగ్గించుకోండి - MicTv.in - Telugu News
mictv telugu

అధిక బరువును ఈజీగా తగ్గించుకోండి

March 1, 2018

వీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? అధికంగా కొవ్వు తగ్గించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోందా? స్థూలకాయాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం. కేవలం అందంగా కనిపించడానికే కాకుండా ఆరోగ్యంగా ఉండాలన్న ఇది తప్పనిసరి. దేహంలో అధిక కొవ్వు వల్ల  డయాబెటిస్, గుండె సంబంధ వ్యాదులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇంట్లోని పదార్థాలే ఔషధాలు..

మ‌న ఇళ్లలో రోజూ వాడే  ప‌దార్థాల‌నే ఆహారంలో త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల అధిక కొవ్వును త‌గ్గించుకోవ‌చ్చు.ఇంతకి ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం!

-ప్రతిరోజూ 2 వెల్లుల్లి రేకులను తింటే ఒంట్లోని కొవ్వు కరిగిపోతుంది. వెల్లుల్లిలోని ఆలిసిన్ అనే రసాయనం యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా పని చేస్తోంది. దాంతో శరీరంలోని కొవ్వు తగ్గి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.

-రోజూ పరిగడపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ నిమ్మరసం కలుపుకుని తాగితే జీర్ణాశయం శుభ్రమవుతుంది. దాంతో కొవ్వు కరిగిపోతుంది.

-టమాటా కేన్సర్ నివారిణి. అలాగే కొవ్వును కరిగించే గుణం కూడా ఉంది. రోజు కూరలలో వాడితే ఒంటికి మేలు చేస్తుంది. పొద్దున్నే రెండు ట‌మాటాల‌ను తిన్నా, లేకపోతే వాటి జ్యూస్‌ను తాగినా ఫ‌లితం ఉంటుంది.

-రోజు గ్రీన్ టీ తాగ‌డం ఎంతో మంచిది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ల‌తోపాటు కొవ్వును క‌రిగించే ల‌క్ష‌ణం కూడా మెండుగా ఉంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

-క్యాబేజీ శ‌రీరంలో అధికంగా పేరుకు పోయిన కొవ్వును క‌రిగించడంలో  బాగానే ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంట్లో క్యాల‌రీలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు.

-ఓట్స్‌లో పీచు ప‌దార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ‌క్రియ‌కు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అంతేకాదు కొవ్వును క‌రిగించే ఔష‌ధ గుణాలు కూడా ఓట్స్‌లో ఉన్నాయి. నిత్యం ఓట్స్‌ను తింటుంటే శరీరంలో అధికంగా ఉండే కొవ్వు క‌రిగిపోతుంది. ఫ‌లితంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.