లవర్స్‌డేకి  ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్..   - MicTv.in - Telugu News
mictv telugu

లవర్స్‌డేకి  ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్..  

February 13, 2018

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్టిప్‌కార్ట్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కొన్ని ఉత్పత్తులపై ఏకంగా 80 శాతం వరకు రాయితీలు ఇస్తోంది. ‘ది ఫ్లిప్ హార్ట్ డే సేల్’ తో వినియోగదారులను ఆపర్లతో ముంచేస్తోంది.

ఈ అమ్మకాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్  కార్డులపై 14శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్ కోసం ది ఫ్లిప్ హార్ట్ డే లాగిన్ అయిన వారికి దుస్తులు, బ్యూటీ, యాక్సెసరీలు, గృహోపకరణాల వస్తువులపై అదనంగా 14శాతం ఢిస్కౌంట్ ఇస్తోంది.

ఎలక్ట్రానిక్ పరికరాలు ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ట్యాబ్లెట్లు, పవర్‌బ్యాంక్‌లతో పాటు పలు యాక్సెసరీలలో కొన్నింటికి 80శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొంది. ఐతే ఏ వస్తువుపై ఈ ఆఫర్ వర్తిస్తుందో సంస్థ కచ్చితంగా వెల్లడించలేదు. మొబైల్ ఫోన్లపై మాత్రం భారీ డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.