ఎవరూ రాయనిది.. గౌతమి ఉమెన్స్ డే పాట - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరూ రాయనిది.. గౌతమి ఉమెన్స్ డే పాట

March 8, 2018

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా  ప్రముఖ నటి గౌతమి ఓ వీడియో సాంగ్ రూపొందించారు. ఈ వీడియోకు ‘గౌతమి’ అనే టైటిల్‌ పెట్టారు. ‘ఎవరూ రాయనిది ఈ కథనం..ఎప్పుడూ చూడనిది ఈ వైనం’ అంటూ సాగుతున్న ఈ పాటలో ఆడపిల్లలను వదిలించుకోవాలని చూడటం, దత్తత ఇచ్చేయడం వంటి ఘటనలను కళ్లకు కట్టినట్టు  చూపించారు. అనాథలైన ఆడపిల్లలను గౌతమి చేరదీసి పెంచుతారు.
ఓ ఆడ శిశువును కుక్క నోటితో పట్టుకున్న సన్నివేశం హృదయం ద్రవించి కన్నీళ్లు పెట్టిస్తోంది. మహిళలకు అంకితం అంటూ గౌతమి ట్విటర్ ద్వారా ఈ వీడియోను విడుదల చేసింది. కాదంబరి పిక్చర్స్ బ్యానర్ ఈ పాటను  నిర్మించింది. ఈ పాటలో నటుడు సంపత్, ప్రముఖ సంగీత విద్యాంసులు, ‘పద్మభూషణ్’ టీవీ గోపాలకృష్ణన్ నటించారు. ఈ పాటను లక్ష్మీ ప్రియాంక రచించింది.