రాహుల్ నాయకుడే కాదు.. హార్థిక్ పటేల్ - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ నాయకుడే కాదు.. హార్థిక్ పటేల్

February 24, 2018

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పటీదార్ ఉద్యమనేత హర్థిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ తన దృష్టిలో నాయకుడే కాదని చెప్పాడు. అంతేకాకుండా రాహుల్ సోదరి ప్రియాంకను  రాజకీయాల్లోకి రావాలని హార్థిక్  ఆహ్వనించాడు.

‘ రాహుల్ ఓ వ్యక్తిగా మాత్రమే నాకు ఇష్టం. అంతేగానీ ఆయనను నేతగా  నేనెప్పుడూ చూడలేదు. అలాగే ఆయన చెప్పేవి విని పాటించడానికి  ఆయన పార్టీ  నాకు అధిష్ఠానం కూడా కాదు. కానీ రాహుల్ సొదరి ప్రియాంక వాద్రా రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నా. ఎందుకంటే ఆమెలో నాయకత్వ లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయని నా అభిప్రాయం’ అని శుక్రవారం ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న  హర్ధిక్‌ ఈ విధంగా మాట్లాడాడు.2019 ఎన్నికల్లో పటీదార్‌ అనమత్‌ ఆందోళన్‌ సమితి ( పీఏఏఎస్‌ ) తరపున పోటీ చేయనని హార్ధిక్‌ స్పష్టం చేశాడు. తాజాగా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హార్ధిక్‌ పోటీ చేయలేదు. 24 ఏళ్ల హార్ధిక్‌కు వయోపరిమితి ( పోటీ చేయాలంటే 25 ఏళ్లు ఉండాలి) కారణంగానే దూరంగా ఉన్నాడు.  2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తాడంటూ కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన హార్ధిక్‌ ఎన్నికల్లో పోటీ చేయాలంటే తననెవరూ అడ్డుకోలేరని చెబుతూ,ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపాడు.