తీపి వస్తువులను తింటే మధుమేహం వస్తుంది అనుకుంటాం. దాంతో తీపి వస్తువులనే తినడం మానేస్తాం. ఇంకా కొన్ని ప్రాథమిక లక్షణాలను చూస్తే ఇది షుగర్ వ్యాధి అనుకుని భయపడతాం. అయితే చాకెట్లు తింటే మంచిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘చాకెట్లు తినేవారు భేషుగ్గా తినండి..
ఏ మాత్రం తినడం అపకండి ’ అని అంటున్నారు. చాకెట్లు తయారుచేసేందుకు వాడే కోకాలో డయాబెటిస్ ను తగ్గించే గుణాలు ఉన్నాయని చెబుతున్నారు.అమెరికా ప్రొఫెసర్ జెఫరీ టెస్సెమ్ నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది.
ఈ బృందం చాకెట్లు-క్యాన్సర్ ప్రభావంపై పరిశోధన చేసింది. చాకెట్ల తయారీలో ఉపయోగించే కోకాలోని ఎపికటెచిన్ మోనోమెర్స్ అనే పదార్థం ఎక్కువ మెతాదులో ఇన్సులిన్ విడుదల చేసింది. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాల వైఫల్యం కారణంగా… డయోబెటిస్ బారిన పడిన వ్యక్తి శరీరం అగిన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి చేయదని చెప్తుతున్నారు.
ఎపికటెచిన్ మోనోమెర్స్ కారణంగా బీటా కణాలు బలంగా మారుతున్నాయనీ. దాంతో శరీరంలో ఇన్సులిన్ అధిక మోతాదులో పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.