మార్కెట్ లోకి ‘హానర్ 7సి’ స్మార్ట్‌ఫోన్…

హువావే సంస్థ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను ‘హానర్ 7సి’ని ఈ రోజు విడుదల చేసింది.  రేపటి నుంచి ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. భారత్‌లో ఈ ఫోన్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.ఈ ఫోన్ 3/4జీబీ ర్యామ్ వేరియెంట్లలో లభింస్తోంది. దీన్ని ధరలు వరసగా రూ. 9,235, రూ. 13,345 ఉన్నాయి.  ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్‌గా ఓ స్లాట్‌ను ఏర్పాటు చేశారు.

‘హానర్ 7సి’ ఫీచర్లు…

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్

2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే

1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్

3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్

256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్

13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2

3000 ఎంఏహెచ్ బ్యాటరీ.