ఆధార్‌ను ఎక్కడెక్కడ వాడారో చెప్పేస్తుంది..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్‌ను ఎక్కడెక్కడ వాడారో చెప్పేస్తుంది..!

February 8, 2018

ఆధార్ అవసరం చాలా  పెరిగిపోయింది. పుట్టుక నుంచి చావు వరకు వెన్నంటే వుంటోంది. ఆధార్ వివరాలు చెప్పందే  ప్రస్తుతం ఏ పనీ జరగడం లేదు. అయితే ఆధార్ కార్డును అంతలా వాడుతున్నాం కదా.. అది ఎక్కడైనా  దుర్వినియోగం  అయ్యే అవకాశాలున్నాయా? అనే సందేహ ప్రతి ఒక్కరికీ వస్తూంటుంది. దీనిపై సుప్రీం కోర్టులో కేసులపైన కేసులు నడుస్తున్నాయి.


అయితే ఈ విషయంలో భయపడాల్సిందేమీ లేదని సర్కారు చెబుతోంది.  ప్రస్తుతమున్న  టెక్నాలజీతో ఆధార్ భద్రత, ఇతర వివరాలను  ఇంట్లోనే  కూర్చుని తెలుసుకునే విధానాన్ని యూఐడీఏఐ తీసుకొచ్చింది. దాన్ని ద్వారా ఆధార్‌ను గత ఆరు నెలల కాలంలో ఎక్కడెక్కడ వాడామో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా ఆధార్ దుర్వినియోగమైనట్లు  గుర్తిస్తే,వెంటనే ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఈ ఫీచర్‌ను ఆన్‌లైన్‌లో సద్వినియోగం చేసుకోవడానికి తప్పకుండా రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్ ఉండాలి. అయితే ఏ విధంగా ఆధార్‌ను చెక్ చేసుకోవచ్చో ఈ వీడియో ద్వారా మీరూ  తెలుసుకోండి.