మోదీ ఫాలోవర్లలో 60 శాతం మంది ఫేక్ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ ఫాలోవర్లలో 60 శాతం మంది ఫేక్

March 14, 2018

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. కానీ ఆయనను  ట్విటర్‌లో ఫాలో అవుతున్నవారిలో 60 శాతం మంది నకిలీ వ్యక్తులేనట. ‘ట్విప్లోమసీ’ ఆన్ లైన్ సర్వే సంస్థ తన నివేదికలో తెలిపింది. మోదీకి మొత్తం 4.09 కోట్లమంది ఫాలోవర్లు ఉండగా,  వారిలో 2.47 కోట్లమంది నకిలీ ఫాలోవర్లు ఉన్నారు. కేవలం 1.61 కోట్ల మందే నిజమైన ఫాలోవర్లు.ఈ గణాంకాలను ట్విటర్ ఆడిట్ అల్గారిథం సాయంతో  లెక్కిచారు. చివరిగా ట్వీట్ చేసిన తేదీ, ఎన్నిసార్లు ట్వీట్ చేశారు అన్న విషయాలను పరిగణనలోకి తీసుకుని ఫేక్ ఫాలోవర్ల  లెక్కలను తేల్చారు. ప్రధాని మోదీకే కాదు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, రాజు సల్మాన్‌లకు సైతం పెద్ద సంఖ్యలో నకిలీ ఫాలోవర్లు ఉన్నట్టు ట్విప్లోమసీ గుర్తించింది. డిజిటల్ వ్యూహన్ని అభివృద్ది చేసుకోవడంలో అంతర్జాతీయ పలు సంస్థలు ,ప్రభుత్వాలకు ‘ట్విప్లోమసీ’ సహకారం అందిస్తోంది.