నడిరోడ్డుపై ఇంటర్ విద్యార్థి హత్య - MicTv.in - Telugu News
mictv telugu

నడిరోడ్డుపై ఇంటర్ విద్యార్థి హత్య

March 12, 2018

హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. ఓ ఇంటర్మీడియట్ హత్యకు గురైనాడు. ముసాపేటకు చెందిన సుధీర్ సోమవారం ఉదయం ఇంటర్ పరీక్షకు రాసేందుకు వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై విచక్షణ రహితంగా వేటకొవళ్లతో నరికి చంపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులతో జరిగిన వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుధీర్‌ స్నేహితులు నవీన్‌, కృష్ణ, మహీ, తేజ తదితరులు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.