భారత్‌లో ఇంటర్‌నెట్ మహాభారతం కాలం నుంచే ఉంది.. త్రిపుర సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో ఇంటర్‌నెట్ మహాభారతం కాలం నుంచే ఉంది.. త్రిపుర సీఎం

April 18, 2018

మహాభారత కాలం నుంచి భారత్‌లో ఇంటర్‌నెట్ ,శాటిలైట్లు  ఉన్నాయని త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దెబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంప్యూటరైజేషన్, సంస్కరణలపై అగర్తలలో జరిగిన ఓ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బిప్లవ్‌కుమార్ మాట్లాడుతూ… ‘లక్షల సంత్సరాల క్రితం నుంచి  ఇంటర్‌నెట్‌ భారత్‌లో ఉంది. మహాభారత కాలం నుంచే భారత్‌లో ఇంటర్‌నెట్, శాటిలైట్ సేవలు ఉన్నాయి. కురుక్షేత్రంలో ధ్రుతరాష్టుడి రథసారధి సంజయుడు. చూపులేని ధ్రుతరాష్టుడికి కురుక్షేత్ర యుద్ధం గురించి ఎలా సంజయనుడు చెప్పగలిగాడు? అంటే సాంకేతిక పరిజ్ఞానం అప్పటికే భారత్‌లో అందుబాటులో ఉందని అర్థమవుతోంది. వాటి సహాయం ద్వారానే సంజయ యుద్ధం గురించి చెప్పాడని’బిప్లవ్ చెప్పారు.‘ ఇంటర్‌నెట్ తమదని యూనైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్‌లు చెప్పుకుంటున్నారు.కానీ  వాస్తవానికి అది భారతీయ సాంకేతికత. గొప్ప సాంస్కృతిక చరిత్ర జాతి సొంతం. అందకు నేను గర్వపడుతున్నాను. ఇప్పటికే సాంకేతిక రంగంలో మనమే ముందున్నాము. మైక్రోసాఫ్ట్ యూఎస్ సంస్థే కావచ్చు. కానీ అందులో పనిచేసే ఇంజినీర్లు అత్యధికులు మన దేశానికి చెందినవారే. మహాభారత కాలం నుంచి టెక్నాలజీలో భారత్ ముందు ఉంది. మధ్యలో అది కనుమరుగై, తిరిగి ప్రస్తుతం మళ్లీ టెక్నాలజీలో దూసుకెళ్తోంది. ప్రపంచానికి అత్యధిక ఇంజినీర్లను అందించడమే ఇందుకు నిదర్శనం’ అంటూ బిప్లవ్ పేర్కొన్నారు.