జాక్వెలిన్.. ఆ నవ్వులేంటి? మతిపోయిందా? - MicTv.in - Telugu News
mictv telugu

జాక్వెలిన్.. ఆ నవ్వులేంటి? మతిపోయిందా?

March 2, 2018

నటి శ్రీదేవి మరణవార్తతో సినిమా అభిమానులు ఎంత కుంగిపోయారో తెలిసిందే. అతిలోక సుందరి ఇక లేదని శోకసంద్రంలో మునిగారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖలంతా ఆమెను కడసారి చూడ్డానికి బారులు తీరారు. అశ్రుతప్త నయనాలతో వీడ్కోలు పలికారు. ఈ దృశ్యాలన్నీ టీవీల్లో వచ్చాయి. అయితే బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాత్రం అందరికీ భిన్నంగా నవ్వుతూ తుళ్లుతూ కనిపించింది. ఒకపక్క గంభీర, విషాదం వాతావరణం కొనసాగుతున్నా అదేమీ పట్టించుకోకుండా అదేదో పెళ్లికి వచ్చినట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ పోయింది ఈ భామ. నానా విషయాలపై సోది పెట్టుకుంది.

ఈ దృశ్యాలను మీడియాకు ఎక్కడంతో జనం ఆమెపై చింతనిప్పులు చెరుగుతున్నారు. ‘అది అంతిమయాత్ర, షూటింగ్ కాదు తల్లీ.  నీకు మతేమైనా పోయిదా? ఏంటా నవ్వులు? సమయం, సందర్భం చూసుకోవాలి కదా…’ అని హితవు పలుకుతున్నారు. ‘మొక్కుబడిగా రావాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండిపోయింటే బావుండేది. జాక్వెలిన్ తీరు కంపరం కలిగించేలా ఉంది’ అని తిడుతున్నారు.