నకిలీ వార్తలు రాస్తే జర్నలిస్టుల గుర్తింపు రద్దు... - MicTv.in - Telugu News
mictv telugu

నకిలీ వార్తలు రాస్తే జర్నలిస్టుల గుర్తింపు రద్దు…

April 3, 2018

నకిలీ వార్తలను రాసినా లేదా పుట్టించినా, ప్రచారం చేసినా జర్నలిస్టుల గుర్తింపును రద్దు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం విలేఖర్లు గుర్తుంపుకు సంబంధించి ఓ నియామవళిని సవరించింది. ఈ నిబంధనల ప్రకారం నకిలీ వార్తలను ప్రచురించినా, ప్రసారం చేసినట్లు నిరూపితం అయితే  సదరు జర్నలిస్టు గుర్తింపును రద్దు చేస్తారు.మొదటి తప్పిదానికి  ఆరు నెలల పాటు గుర్తింపు రద్దు చేస్తారు. రెండోసారి అదే పని చేస్తే సంవత్సరం పాటు, మూడోసారి తప్పు చేస్తే గుర్తింపును శాశ్వతంగా రద్దు చేయనుంది ప్రభుత్వం. ఫేక్‌ న్యూస్‌పై వచ్చే ఫిర్యాదులను పీసీఐ, ఎన్‌బీఏలు పరిశీలించి 15 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తాయని ప్రభుత్వం వివరించింది.