పిచ్చివాడిని చావగొట్టి సెల్ఫీ.. ఎర్రగడ్డకు పంపాల్సింది ఎవరిని? - MicTv.in - Telugu News
mictv telugu

పిచ్చివాడిని చావగొట్టి సెల్ఫీ.. ఎర్రగడ్డకు పంపాల్సింది ఎవరిని?

February 23, 2018

మానవత్వం రోజురోజుకూ మంటగలిసిపోతోంది. కొందరు దుర్మార్గులు.. మతిస్థిమితి లేని వ్యక్తిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. మాటల్లో చెప్పలేని చిత్రహింసలుపెట్టారు. బుద్ధి మరింత వంకర్లకు పోయింది. దుండగులు ఆ పిచ్చివాడితో సెల్ఫీలు దిగారు. వారి దాడికి తట్టుకోలేక బాధితుడు ప్రాణాలు విడిచాడు.  ఈ దారుణ సంఘటన కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా అట్టప్పడి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.27 ఏళ్ల వ్యక్తి  అటవీ ప్రాంతానికి దగ్గరున్న ఓ గ్రామంలో నివసిస్తున్నాడు. అతనికి మతిస్థిమితం లేదు. దుకాణాల్లో దొంగతనాలు చేస్తున్నాడన్నకారణంతో  అతడిని స్థానికులు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ సమయంలో కొందరు యువకులు సెల్ఫీలు తీసుకున్నారు. చిత్రహింసలు తట్టుకోలేక ఆయన యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. మానవత్వమున్న కొందరు మనుషులు  పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని  తెలిపారు.