మన నగరం మొదలైంది.. - MicTv.in - Telugu News
mictv telugu

మన నగరం మొదలైంది..

December 16, 2017

హైదరాబాద్ నగరాన్ని మరింత  అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ‘మన నగరం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంత్రి కేటీఆర్ శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  నగరంలోని కుత్భుల్లాపూర్‌లో ‘మన నగరం/అప్నా షెహర్’ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లను 50కి పెంచుతున్నట్టు ఆయన తెలిపారు.ఇక నుంచి ప్రజల వద్దకే అధికారులు వస్తారని, స్థానికంగా ఉన్న సమస్యలను వారికి చెప్పాలని సూచించారు. సర్కిళ్ల వారీగా సమావేశాలు జరుగుతాయని, కాలనీ సంక్షేమ సంఘాలతో,ప్రజలతో అధికారులు నేరుగా చర్చిస్తారని వెల్లడించారు.  మనం మారుదాం-నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో అప్నా షహెర్ కార్యక్రమాన్ని చేపట్టామని కేటీఆర్ తెలిపారు.