ఒక్క ట్వీట్‌తో 7 కోట్ల నష్టం - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్క ట్వీట్‌తో 7 కోట్ల నష్టం

February 23, 2018

ప్రముఖ మోడల్, రియాల్టీ టీవీ స్టార్ కైలీ జెన్నర్ చేసిన పనికి స్నాప్‌చాట్ సంస్థ నష్టాల పాలైంది. కైలీ చేసిన ఒక్క ట్వీట్‌తో కంపెనీ షేర్లు పతనమయ్యాయి. 1.3 మిలిమన్ల డాలర్లు (7వేల కోట్లు నష్టాన్ని చవిచూసింది.ఇంతకూ ఆ ట్వీట్ ఏమంటే?.. ‘స్నాప్‌‌చాట్‌ ఇక మీదట ఎవరైనా తెరవకూడదనుకుంటున్నారా? అది నేనే అనుకుంటున్నారా? ఇది చాలా బాధకరం’’ అని.2.45 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆమె ట్విట్టర్‌ ఖాతా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. షేర్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో కెల్లీ వెంటనే.. ‘అయినప్పటికీ నువ్వే నా తొలిప్రేమ.. నువ్వంటే నాకిష్టం’ అంటూ స్నాప్‌‌చాట్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేసింది. కానీ, అప్పటికే స్నాప్‌చాట్‌కు  జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు 8శాతం పైగా షేర్లు పడిపోయి వాల్‌‌స్ట్రీట్‌ వద్ద 6 శాతానికి చేరుకుని షేర్‌ విలువ 17 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్నాప్‌‌చాట్‌ స్థాపించిన సమయంలో షేర్‌ ఇదే విలువ ఉండటం విశేషం.

ఇన్‌స్ట్రామ్‌ నుంచి గట్టి పోటీని ఎదుర్కుంటున్న స్నాప్‌‌చాట్‌‌లో మార్పులు కోరుతూ స్నాప్‌చాట్  ఖాతాదారులు పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా పిటిషన్‌పై సంతకం చేసి స్నాప్‌‌చాట్‌కు సమర్పించారు. అయినప్పటికీ  ఎలాంటి మార్పులు చేసేందుకు స్నాప్‌చాట్‌ విముఖత వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కైలీ కూడా అసంతృప్తి వ్యకి చేసింది. దాంతో స్నాప్‌చాట్ కు వేల కోట్ల నష్టం  జరిగిపోయింది.