10 నెలల కుతూరి కళ్ళ ముందే ఆత్మహత్య..... - MicTv.in - Telugu News
mictv telugu

10 నెలల కుతూరి కళ్ళ ముందే ఆత్మహత్య…..

February 22, 2018

పాపం ఆ దంపతులకు ఏం కష్టం వచ్చిందో.. కన్న కూతురిని అనాధను చేసి బలవన్మరణానికి పాల్పడ్డారు. తాము వెళ్లి పోయాక తమ కూతురి భవిష్యత్తు ఏంటో అని ఒక్కక్షణం ఆలోచించినా ఈ ఘాతుకానికి పాల్పడేవారు కాదేమో

. అత్యంత హృదయ విదారక ఈ ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్‌లో  ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. పది నెలల కుతూరి కళ్లముందే ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. లోకం తెలియని ఆ పాపకు తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారని తెలియదేమో.. తెలిసుంటే ఆపేదేమో.. పట్టాల మీద తల్లిదండ్రుల శవాలు పడున్నాయి. ప్లాట్‌ఫామ్ మీద  పాల కోసం గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ పసిపాపను చూసి చాలా మంది గుండెలు బరువెక్కాయి.

తూప్రాన్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న దంపతులు తమ పది నెలల చిన్నారిని రైల్వేఫ్లాట్‌ఫాంపై కూర్చోబెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వద్ద ఉన్న ఆధార్‌ కార్డుల ఆధారంగా వారిని నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌కు చెందిన  ఒంటెద్దు కాశీరాం దంపతులుగా పోలీసులు గుర్తించారు.