ఎంపీ  మేరీకోమ్ స్వర్ణం  సాధించారు... - MicTv.in - Telugu News
mictv telugu

ఎంపీ  మేరీకోమ్ స్వర్ణం  సాధించారు…

April 14, 2018

భారత బాక్సింగ్ దిగ్గజం, రాజ్యసభ సభ్యురాలు మేరీకోమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. మహిళల 48 కేజీల విభాగంలో ఐర్లాండ్‌కు చెందిన క్రిస్టినీ ఓహారాపై మేరికోమ్ విజయం సాధించి పసిడి పతకాన్ని  ముద్దాడింది. కామన్వెల్త్‌ క్రీడల్లో మేరీకోమ్‌ పాల్గొనడం ఇదే తొలిసారి. పాల్గొన్న తొలి కామన్వెల్త్‌ గేమ్స్‌లోనే బంగారు పతకం సాధించడం పట్ల మేరీకోమ్‌ సంతోషం వ్యక్తం చేసింది. మేరీకోమ్‌ ట్విటర్‌ ద్వారా తన సంతోషాన్ని పంచుకుంది… ‘కామన్వెల్త్‌ గేమ్స్‌లో నేను గెలిచిన ఈ బంగారు పతకాన్ని నా ముగ్గురు కుమారులకు అంకితమిస్తున్నాను. నాకు ఫోన్‌ చేసినప్పుడల్లా వారు ఇంటికి ఎప్పుడొస్తావు అని అడిగేవారు. నా కోచ్‌లకు, సపోర్టింగ్‌ స్టాఫ్‌, శాయ్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొంది.మేరీకోమ్‌ స్వర్ణం సాధించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, మహమ్మద్‌ కైఫ్‌ ట్విటర్‌ ద్వారా మేరీకోమ్‌కు అభినందనలు తెలిపారు.