మెర్సల్ చిత్రాన్ని నిషేధించలేం... - MicTv.in - Telugu News
mictv telugu

మెర్సల్ చిత్రాన్ని నిషేధించలేం…

October 27, 2017

బీజేపీ సర్కారును ఇబ్బంది పెడుతున్న తమిళ మూవీ ‘మెర్సల్‌’ను నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. ఇందులో మోదీ ప్రభుత్వ పథకాలను కించపరిచే డైలాగులు ఉన్నాయని, ఈ సినిమాను నిషేంధించాలంటూ బీజేపీ నేతలు ఈ పిటిషన్  దాఖలు చేశారు.

దీన్ని కోర్టు శుక్రవారం విచారించింది. ‘మెర్సల్  అనేది ఓ కల్పిక కథనే కాని, నిజ జీవితం  కాదు కదా’ అని  న్యాయమూర్తి  పేర్కొన్నారు.  ఈ చిత్రం సమాజంపై ఏదో పెద్ద ప్రభావం చూపుతుంది అనడం అర్థరహితమంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధూమపానం, మద్యపానం హనికరమంటూ ప్రకటనలు జారీ  సినిమాలకంటే మెర్సల్ అంత ప్రమాదకరమైన చిత్రమా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘సినిమా నచ్చకపోతే చూడకండి.

అంతేకాని ఇలా పనికిమాలిన పిటిషన్లతో న్యాయస్థాన సమయాన్ని వృథా చేయకండి’ అని మండిపడ్డారు. వివాదాలతో సినిమాకు ఉచిత ప్రచారం లభిస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. భారతదేశంలోని ప్రతి పౌరుడు తమ బావాలను స్వేచ్ఛగా  ప్రకటించుకునే హక్కు ఉందంటూ పిటిషన్‌ను కొట్టేశారు.