బిల్‌గేట్స్ మళ్లీ నటనలోకి.. పారితోషికం పుచ్చుకోడు..   - MicTv.in - Telugu News
mictv telugu

బిల్‌గేట్స్ మళ్లీ నటనలోకి.. పారితోషికం పుచ్చుకోడు..  

February 21, 2018

మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ మళ్లీ తెర‌పై కనిపించనున్నారు. ఈ వార్త ప్రస్తుతం  అంద‌రిలోనూ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. కామెడీ సిరీస్‌లో ఆయన  ఓ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అపర కుబేరుడైన గేట్స్ ఇందుకు నయాపైసా పారితోషికం కూడా తీసుకోవడం లేదు. 2001లో వ‌చ్చిన ‘ఫ్రాసియ‌ర్’ కామెడీ సిరీస్‌లో న‌టించిన గేట్స్ ఇప్పుడు హాలీవుడ్‌లో పాపులర్‌ అయిన కామెడీ సిరీస్‌ ‘ది బిగ్‌ బ్యాంగ్‌ థియరీ’లో అతిథి పాత్రలో నటించనున్నారు. ఈ ఎపిసోడ్‌ను వచ్చే నెల ప్రసారం చేయనున్నారు. అయితే గేట్స్‌ ఇందులో వేరే పాత్రలో కాకుండా మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే నటిస్తారు.సిరీస్‌లో భాగంగా నిర్వహించే ఓ కార్యక్రమానికి గేట్స్‌ ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. ఆయనతో పాటు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ తదితరులు పాల్గొననున్నారు. 2001లో వచ్చిన ‘ఫ్రాసియర్‌’ అనే కామెడీ సిరీస్‌లోనూ గేట్స్‌ అతిథి పాత్రలో నటించారు.