మంత్రి జోగు రామన్నకు తప్పిన ప్రమాదం... - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రి జోగు రామన్నకు తప్పిన ప్రమాదం…

February 17, 2018

తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగు రామన్నకు, ఎమ్మెల్యే దివాకర్ రావుకు  ప్రమాదం తప్పింది. మంచిర్యాల జిల్లాలో మున్నూరు కాపు సామాజిక భవన నిర్మాణానికి జోగు రామన్న, దివాకర్ రావు భూమి పూజ చేశారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన  సభలో రామన్న,దివాకర్ టీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్త్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది.

దాంతో షామియానాకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన నేతలు, కార్యకర్తలు, పోలీసులు షామియానాను కిందికి దించి  బయటకు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదం నుంచి  అందరు సురక్షితంగా బయట్టపడ్డారు.  షార్ట్‌సర్క్యూట్ కారణంగా షామియానా, వేదిక, కుర్చీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంత్రి, ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడటంతో కార్యకర్తలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.