ఎంపీకి కోపం తెప్పించిన కత్తెర ! - MicTv.in - Telugu News
mictv telugu

ఎంపీకి కోపం తెప్పించిన కత్తెర !

February 22, 2018

కత్తెర ఏంటి ఎంపీకి కోపం తెప్పించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును బీజేపీ ఎంపీ మురళీ మనోహర్ జోషీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ గుమ్మం ముందు రిబ్బన్ కూడా కట్టారు. కానీ ఆ రిబ్బన్ కట్ చేయడానికి హడావిడిలో కత్తెర పెట్టడం మర్చిపోయారు. కత్తెర కోసం చాలా సేపు వేచి చూసిన ఎంపీ చివరకు ఆవేశంలో రిబ్బన్ ను చేతిలో లాగేశారు. కత్తెర పెట్టడం తెలీదా అని అక్కడి అధికారులపై మండిపడ్డారు.

ఆ తర్వాత అధికారులను బూతులు తిడుతూ రుసరుసలాడారు. ఎంపీ  కోపంతో ఊగిపోతుంటే ఒక్క అధికారి కూడా నోరు విప్పలేకపోయారు. చివరకు ఓ వ్యక్తి కత్తెర తీసుకువచ్చినా కూడా ఎంపీ జోషీ మాత్రం రిబ్బన్ కట్ చేయకుండానే అసహనంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.