నా పిల్లలకు పోర్న్ గాలి సోకనివ్వను.. సన్నీలియోని - MicTv.in - Telugu News
mictv telugu

నా పిల్లలకు పోర్న్ గాలి సోకనివ్వను.. సన్నీలియోని

April 6, 2018

‘మా అమ్మానాన్నలు నాకు స్వేచ్ఛ ఇవ్వటం వల్లే పోర్న్‌నే కెరియర్ అనుకున్నాను. కానీ నా పిల్లలను అటు వైపు అస్సలు వెళ్ళనివ్వను ’ అని పోర్న్‌స్టార్ సన్నీలియోని తెలిపింది.  పోర్న్‌స్టార్‌గా కెరియర్ ప్రారంభించింది సన్నీలియోని ఆ తర్వాత ‘ బిగ్‌బాస్ ’ షో ద్వారా ఇండియా వచ్చి బాలీవుడ్‌లోనే సెటిలైపోయింది. అనతి కాలంలోనే ఐటం సాంగులు, ప్రాధాన్యమున్న పాత్రలు చేసి బాలీవుడ్‌లో పాతుకుపోయింది. ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ క్రేజ్ సంపాదించుకున్న సన్నీకి ఇప్పుడు పోర్న్ అంటే అసహ్యం అనిపిస్తోందట. గతేడాది మహారాష్ట్రలోని లాతూర్ నుంచి ఓ పాపను దత్తత తీసుకున్న సన్నీ, వెబర్ దంపతులకి ఈ మ‌ధ్య స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు క‌వ‌ల మ‌గ పిల్ల‌లు జ‌న్మించారు. ఆషెర్ సింగ్ వెబర్, నోవా సింగ్ వెబర్, నిషా కౌర్ వెబర్‌లతో సన్నీ ఇల్లు కళకళలాడుతోంది. కాగా త‌న పిల్ల‌ల భవిష్య‌త్ గురించి తాజాగా స్పందించింది స‌న్నీ.

‘నేను పోర్న్ సినిమాల్లో నటించడం వల్ల నాకు ఎలాంటి అసంతృప్తీ లేదు. ఈ సమాజం నుంచి చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. చాలా మంది నన్ను తల పట్టుకునే బూతులు తిట్టారు. ప‌లువురు అస‌హ్యించుకోవ‌డం నన్ను బాధించింది. అలాంటి పరిస్థితి నా పిల్లలకు అస్సలు రానివ్వను. వాళ్ళని పోర్నోగ్ర‌ఫీ వైపు అస్స‌లు వెళ్ల‌నీయ‌ను. వాళ్ళ కెరియర్ విష‌యంలో స్వ‌తంత్రంగా వదిలేస్తాను. ఏది మంచిదో ఏది మంచిది కాదో వివరించి చెప్పి వారిని మంచి దారిలోకి తెస్తాను ’ అని చెప్పింది సన్నీ.

ఇదిలా వుండగా జీ టీవి గ్రూప్ ‘కరెంజిత్ టు సన్నీ’  పేరుతో స‌న్నీ బ‌యోపిక్ రూపొందుతోంది. ఇందులో పోర్న్‌కి ముందు ఆ తర్వాత సన్నీ జీవిత విశేషాలని చూపించనున్నారు. అలాగే స‌న్నీ రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘వీర‌మాదేవి ’ సినిమాలో కూడా నటిస్తోంది.