అంగారకుడిపై సరుకులు పడేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

అంగారకుడిపై సరుకులు పడేశారు..

November 21, 2017

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. 2020లో  చేపట్టనున్న అంగారక మిషన్‌లో మెుదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్యారాచూట్ ద్వారా అంగారకుడిపైకి పే లోడ్ ప్రవేశపెట్టి విజయం సాధించింది. సెకనుకు 5.4 కి.మీల వేగంతో అరుణ గ్రహంపై ప్రవేశించే పేలోడ్ వేగాన్ని ప్రత్యేక వస్త్రంతో తయారు చేసిన ప్యారాచ్యూట్ ద్వారా జారవిడిచారు.

ఈ ప్రయోగానికి ‘అడ్వాన్స్‌డ్ సూపర్‌సోనిక్ ప్యారాచ్యూట్ ఇన్ ఫ్లేషన్ రీసెర్చ్ ఎక్స్ పెరిమెంట్’ (ఆస్పైర్) అని పేరు పెట్టారు. అక్టోబర్ 4న అమెరికాలోని నాసా గొడార్డ్ స్పేస్ ఫ్లెట్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది.  ముందు రాకెట్ ద్వారా మార్స్ మీదకు పేలోడ్‌ను పంపారు.  పేలోడ్ రాకెట్ నుంచి అంగారకుడి ల్యాండ్ అయ్యే సమయంలో ప్యారాచ్యూట్ స్థితిగతులను, మార్పులను ఆధ్యయనం చేశారు. ప్రయోగం వీడియోను నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ యూట్యూబ్ చానల్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో రాకెట్ ప్రయోగం నుంచి పే లోడ్ ల్యాండ్ కావడం, ప్యారాచ్యూట్ తెరుచుకోవడం, రాకెట్ తిరిగి అట్లాంటిక్‌లో పడడం ఉంది.