వీడు మరో నీరవ్ మోదీ... - MicTv.in - Telugu News
mictv telugu

వీడు మరో నీరవ్ మోదీ…

February 24, 2018

ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో దాదాపు రూ.11,400కోట్ల భారీ మోసాలకు పాల్పడి విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా మరో కంపెనీ భారీ మోసం బయటపడింది.  ఢిల్లీకి చెందిన ద్వారకాదాస్‌ సేథ్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే వజ్రాల ఎగుమతి కంపెనీ ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లో రూ.389.85కోట్ల భారీ మోసానికి పాల్పడ్డట్టు సీబీఐ అధికారులు గుర్తించి, కంపెనీపై కేసు నమోదు చేసింది.ఈ కంపెనీపై ఓరియంటల్ బ్యాంకు ఆరు నెలల క్రితమే సీబీఐకి ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన ఆనంతరం  సీబీఐ కంపెనీకి  చెందిన డైరెక్టర్లు సభ్యసేథ్‌,  రీటాసేథ్‌, కృష్ణకుమార్‌ సింగ్‌, రవిసింగ్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ద్వారకాదాస్‌ సేథ్‌ సెజ్‌ ఇన్‌కార్పొరేషన్‌ పేరుతో ఉన్న మరో కంపెనీ పైనా సీబీఐ కేసు పెట్టింది. ఈ కంపెనీ ఓరియంటల్‌ బ్యాంకు నుంచి 2007 నుంచి 2012 సంవత్సరాల మధ్య చాలాసార్లు రుణాలు పొందింది. మొత్తం రూ.389కోట్లు బ్యాంకుకు బకాయి పడింది. ఈ కంపెనీ కూడా లెటర్స్‌‌ ఆఫ్‌ క్రెడిట్‌ ( ఎల్‌ఓయూ ) ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్టు సీబీఐ గుర్తించింది.