పద్మావతికి నిరసల సెగ.. మూవీ  వాయిదా - MicTv.in - Telugu News
mictv telugu

పద్మావతికి నిరసల సెగ.. మూవీ  వాయిదా

November 20, 2017

పద్మావతి మూవీకి అనుకున్నట్లుగానే ఆంటకాలు ఎదురయ్యారు. తీవ్ర నిరసనలు, చంపుతామని బెదిరింపుల నేపథ్యంలో చిత్రం విడుదలను వాయిదా వేశారు. మూవీ డిసెంబర్ 1 విడుదల కానుండగా, వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ వయోకామ్ 18 మోషన్ పిక్చర్స్ ప్రకటించింది. త్వరలోనే  కొత్త తేదీని ప్రకటిస్తామని  తెలిపింది. స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నామంది. అయితే పద్మావతిగా నటించిన దీపికను, దర్శకుడు భన్సాలీని చంపుతామని రాజపుత్ కర్ణిసేన, బీజేపీ నేతలు హెచ్చరించడం, సినిమాకు ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం వంటి కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రాణి పద్మిని కథ ఆదారంగా  ఈ మూవీని తెరకెక్కించారు. సినిమా చిత్రీకరణ నుంచి వివాదాలను  ఎదర్కొటూనే ఉంది. ఈ చిత్రంలో రాణి పద్మావతి గురించి తప్పుగా చిత్రీకణ  జరిగిందని రాజ్ పుత్  కర్ణిసేన , బీజేపీ నేతలు పద్మావతి యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.   ఈ వివాదం రోజు  రోజుకు ముదిరి పాకన పడుతోంది. దీన్ని  ప్రదర్శిస్తే థియేటర్తను దగ్ధం చేస్తామని కర్ణిసేన హెచ్చరించింది. చిత్రంలో పద్మావతి పాత్రలో నటించిన దీపిక పదుకునే ముక్కును కోసేస్తామని  కూడా హెచ్చరించారు.