సింగర్‌ను వేధించిన పాక్ నటుడు - MicTv.in - Telugu News
mictv telugu

సింగర్‌ను వేధించిన పాక్ నటుడు

April 20, 2018

మహిళలు, చిన్నపిల్లలు   ప్రతీ చోటా లైంగిక వేధింపులకు గురివుతునే ఉన్నారు. తాజాగా  గాయని మీషాషఫీ(36) కూడా లైంగిక వేధింపులను ఎదుర్కుంది.యువ నటుడు అలీ జఫర్‌పై  మీషా సంచలన ఆరోపణలు చేసింది. అలీ తనని లైంగికంగా వేధించాడంటూ ఆమె తన ట్విటర్‌లో ఓ పోస్టు  చేసింది. ఇప్పటికైనా తాను మౌనం వీడకపోతే అర్థం లేదని.. ‘మీటూ క్యాంపెయిన్‌ ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న తరుణంలో నాపై జరిగిన అఘాయిత్యం గురించి కూడా స్పందిస్తున్నాను. ఇద్దరు పిల్లల తల్లి అని కూడా చూడకుండా జఫర్‌  తాకరాని చోట తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. రేపు మరో అమ్మాయికి ఇలా జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ విషయం బయటపెడుతున్నాను’ అని మీషా తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై అలీ స్పందిస్తూ…‘మీటూ ఉద్యమానికి నేను మద్ధతు ఇస్తాను. నేనూ ఓ పాపకు తండ్రినే. నా గురించి నా మిత్రులకు, బంధువులకు బాగా తెలుసు. అలాంటిది నాపై ఇలాంటి విమర్శలు రావటం తట్టుకోలేకపోతున్నా. దాచటానికి ఏం లేదు. మౌనంగా ఉండటం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అందుకే న్యాయపరమైన చర్యలకు సిద్ధమైపోతున్నాను’ అని అలీ జఫర్‌ తన ట్విటర్‌లో  పోస్టు చేశాడు. మీషాకు లీగల్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిపాడు.