అఫ్రిది సోదరుడు ఉగ్రవాది.. అందుకే అలా కూశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

అఫ్రిది సోదరుడు ఉగ్రవాది.. అందుకే అలా కూశాడు..

April 4, 2018

భారత్‌పై నోరుపారేసుకున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి ఓ ఉగ్రవాదితో సమీప బంధుత్వం ఉంది. ఆఫ్రిది కజిన్ సకిబ్.. హర్కత్-ఉల్-అన్సర్ అనే ఉగ్రవాద సంస్థలో పనిచేశాడు.  రెండేళ్లపాటు కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భారత సైనికులపై, ప్రజలపై దాడులు చేశాడు. సకిబ్ అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదుల మద్దతుదారులతో మాట్లాడేటప్పుడు ఆఫ్రిది తన బంధువుని చాలా గొప్పగా చెప్పేవాడని తెలుస్తోంది. 2003లో సెప్టెంబర్‌లో అనంత్‌నాగ్‌లో అతణ్ని  బీఎస్ఎఫ్ దళాలు మట్టుబెట్టాయి.అందుకే అఫ్రిది.. తరచూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తున్నాడని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం అమాయకులను ఊచకోత కోస్తోందని, ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని అఫ్రిది ట్వీట్ చేయడం తెలిసిందే. కశ్మీర్ పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, స్వీయ అధికారం, స్వతంత్రం కోసం పోరాడుతున్న ప్రజలను భారత ప్రభుత్వం కాల్చేస్తోందని పేర్కొన్నాడు. ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ రక్తపాతాన్ని ఎందుకు ఆపడం లేదని  తెగ బాధపడ్డాడు.