టెంపర్ రీమేక్‌లో ప్రియా ... - MicTv.in - Telugu News
mictv telugu

టెంపర్ రీమేక్‌లో ప్రియా …

March 12, 2018

కంటి చూపుతో చూసి గన్నుతో  కోట్లాది అభిమానుల హృదయాలను పేల్చేసిన మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ .‘ఒరు ఆదార్ లవ్’ అనే చిత్రంలోని ‘మాణిక్య మలారాయ పూవి’  అనే పాటలో ఆమె పలికించిన హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రియా  తొలిచిత్రం విడుదల కాకముందే ఆమెకు బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల నుంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఆ మ‌ధ్య నిఖిల్ స‌ర‌స‌న ప్రియా క‌థానాయిక‌గా ఎంపికైంద‌ని వార్త‌లు  వచ్చాయి. ఇప్పుడు టెంప‌ర్ రీమేక్‌లో ప్రియా ప్ర‌కాశ్‌నే హీరోయిన్‌గా ఎంపిక చేశారని సినీ సమాచారం. బాలీవుడ్ డైరెక్ట‌ర్ రోహిత్‌శెట్టి టెంప‌ర్ రీమేక్ చేస్తుండ‌గా, ఇందులో ర‌ణ్‌వీర్ సింగ్  హీరోగా నటిస్తున్నాడు. ‘సింబా’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఇందులో హీరోయిన్‌గా శ్ర‌ద్ధా క‌పూర్‌, జాన్వీ, అలియా భ‌ట్ పేర్లు వినిపించినప్పటికీ ఇప్పుడు ప్రియానే హీరోయిన్‌గా ఫిక్స్ అయిందంటూ ప‌లు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.