గల్ఫ్ దేశమైన ఖతర్‌లోని వలసకార్మికులకు ఆ దేశ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2020లో వరల్డ్ కప్ నిర్వహించనున్న నేపథ్యంలో వారికి కనీస వేతనాలు అందిస్తామని ప్రకటించింది. కార్మికులకు సంబందించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలిపాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నవంబర్లోనే తెలిపాలని ఇటీవల ఆ దేశాన్ని ఆదేశించింది.
కార్మికులకు కనీన వేతన చట్ట వివరాలను విదేశీ అధికారుల సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ డెవలప్ మెంట్ మంత్రి ఇస్పాసాద్ ఆల్ జపర్ ఆల్ సుయిమి ప్రకటించారు. ఈ చట్టం ద్వారా కార్మికులకు ప్రయోజనం కల్పించేలా నిర్ణయించామని మంత్రి తెలిపారు.ఖతార్ లో కార్మికా చట్టాలు చాలా కఠినంగా దశాబ్దాల కాలం నుంచి అమలులో ఉన్నాయి. ’ఖపాలా’ చట్టం ప్రకారం వలస కార్మికులు ఉద్యోగం మానేయాలంటే ముందు యాజమానికి అనుమతి తీసుకోవాలి.అంతేకాదు దేశం వదలి వెళ్లాలన్నా కూడా యాజమాని అనుమతి తప్పనిసరి. అయితే గత ఏడాది ‘ఖపాలా ’ విధానాన్ని రద్దు చేశారు.